‘MAD Square’ ట్రైలర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తూ, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నార్ని నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫన్, ఎమోషన్స్ మేళవించి ట్రైలర్ కట్ చేశారు.
ట్రైలర్ ప్రారంభం నుంచే చమత్కారమైన డైలాగ్స్, ఆకట్టుకునే వన్ లైనర్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. హీరోల మధ్య జరిగే హాస్యపూరిత సన్నివేశాలు, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ సినిమా చూసేంతలా ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పాత్రల మధ్య వచ్చే సందడి ట్రైలర్‌కే హైలైట్‌గా మారింది.
Just a small trailer…
before the MASSIVE FUN METER hits the big screens 😎🤘🏼#MadSquare Trailer out now ❤️
— https://t.co/MiXmDrIPzJAlready Ardam aipoindi ankunta – March 28th kummeddam 😉🔥@NarneNithiin #SangeethShobhan @ItsJawalkar @MusicThaman @kalyanshankar23 @vamsi84… pic.twitter.com/4QUZdNbjzs
— Sithara Entertainments (@SitharaEnts) March 26, 2025
ఫస్ట్ పార్ట్ ‘MAD’ లా ఈ సినిమా కూడా యూత్‌ను అలరిస్తుందా? అనేదానికి ట్రైలర్ మంచి క్లారిటీ ఇస్తోంది. సినిమా కథాంశం పూర్తిగా రివీల్ కాకుండా, అంచనాలు పెంచే విధంగా ట్రైలర్‌ను కట్ చేయడం విశేషం.
టెక్నికల్‌గా కూడా సినిమా హై స్టాండర్డ్స్ లోనే తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, కలర్ ఫుల్ షాట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అవుతాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఫ్రెండ్షిప్, ఫన్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ మళ్లీ ‘MAD Square’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇప్పటికే ఫస్ట్ పార్ట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ని దృష్టిలో ఉంచుకుని, ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌తో ఈ అంచనాలను మేకర్స్ మరింత పెంచారు. థియేటర్లలో ‘MAD Square’ ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి!