డ్రగ్స్ కేసుతో తమిళ సినీ పరిశ్రమ మరోసారి సంచలనంగా మారింది. కోలీవుడ్ నటుడు శ్రీరామ్ ఈ కేసులో పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కలకలం రేపుతోంది.
ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ AIADMK నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా చెన్నై పోలీసులు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆ తర్వాత ఆయనకు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తనమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాకం పోలీస్ స్టేషన్‌కు తరలించి దాదాపు రెండు గంటలపాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read: వైట్ బికినీలో మెగా హీరోయిన్ హాట్ లుక్ వైరల్.. నెటిజన్ల ఘాటు స్పందన!
శ్రీరామ్ అసలుపేరు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆయన సినీ కలలు నెరవేర్చేందుకు చెన్నై చేరుకున్నారు. అప్పట్లో తన స్క్రీన్ నేమ్‌ను శ్రీరామ్‌గా మార్చుకుని సినీ కెరీర్ ప్రారంభించారు.
తమిళ చిత్రం ‘రోజా కూటం’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్, అదే చిత్రం తెలుగులో ‘రోజా పూలు’ పేరుతో రిలీజ్ అయ్యింది. అనంతరం ‘ఒకరికొకరు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హీరోగా కాకపోయినా, పలు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆయన్ని పోలీసులు విచారిస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఘటనపై పెద్ద చర్చ మొదలైంది.