కోలీవుడ్ యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘మొగిల్ పేట’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, గత ఏడాది ‘డ్రాగన్’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో కయాదుకు ఫుల్ పాపులారిటీ వచ్చింది.
ప్రస్తుతం కయాదు వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఆమె విశ్వక్ సేన్ సరసన ‘ఫంకీ’లో కనిపించనుంది.
‘ది ప్యారడైజ్’లో బోల్డ్ రోల్
తాజాగా కయాదు లోహర్ మరో సెన్సేషన్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ మూవీలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇందులో హీరోయిన్ ఒక సెక్స్ వర్కర్ పాత్రలో స్క్రీన్‌పై కనిపించనుందట.
ఈ పాత్రలో కొంత స్కిన్ షో, బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ, కయాదు స్క్రిప్ట్‌కి ఇంప్రెస్ అయి ఏ అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు కూడా సమాచారం. సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేక హైలైట్‌గా నిలవనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “నీకేం పోయే కాలం వచ్చిందా? ఇలా బోల్డ్ రోల్స్ ఎందుకు తీసుకుంటున్నావు?” అంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది ఆమె కెరీర్‌కి కొత్త దశ తీసుకువస్తుంది” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నాని – కయాదు కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది.