Kishkindhapuri Trailer : ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. థ్రిల్‌కి గురిచేస్తున్న కిష్కిందపురి ట్రైలర్!

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన కిష్కిందపురి ట్రైలర్ విడుదలైంది. ”ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మ” అనే వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ట్రైలర్ చూస్తుంటే, ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని స్పష్టంగా తెలుస్తోంది. దెయ్యాలు, ప్రేతాత్మల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో కొంతమంది యువకులు ‘కిష్కిందపురి’ అనే హాంటెడ్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడ నిజంగానే ఒక ప్రేతాత్మ ఉంటుందని గ్రహిస్తారు. ఆ ప్రేతాత్మ హీరోయిన్ అనుపమ శరీరంలోకి ప్రవేశించడం కథలో కీలక మలుపు.

ఆ తర్వాత హీరో ఆమెను ఆ ప్రేతాత్మ నుండి ఎలా రక్షిస్తాడు? అసలు ‘కిష్కిందపురి’ హాంటెడ్ హౌస్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అన్నది ఈ సినిమా సస్పెన్స్.

ట్రైలర్‌లో వినిపించిన ‘‘ఆ రాక్షస శక్తిని ఎవరూ ఆపలేరు..’’ అనే డైలాగ్ హారర్ ఫీల్‌ను మరింత పెంచింది.

Leave a Reply