కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ ‘కాంతారా’ తన విజయాన్ని మళ్ళీ ‘కాంతారా: చాప్టర్ 1’ ద్వారా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడలో ఒరిజినల్ వెర్షన్ విడుదల అవుతుండగా, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుకు అనుమతి కోరగా, ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో జారీ చేసింది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అహంకారానికి బలవుతున్న హిందూ పౌరాణికత తెలియచేసే సినిమా Kantara.
బెంగళూరు లో HHVM, #TheycallhimOG సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ “బెంగళూరు గడ్డ, పవన్ కళ్యాణ్ అడ్డా” అని కేకలు పెడుతూ కన్నడిగులను రెచ్చకొట్టారు.
పవన్ కళ్యాణ్ కి… pic.twitter.com/qt6GKadGkf
— Toorpu Teeram (@ToorpuTeeram) September 28, 2025
టికెట్ రేట్ల పెంపుపై నెటిజన్ల అభ్యంతరాలు
ఏపీలో ‘కాంతారా’ టికెట్ రేట్లు పెంచడంపై తెలుగు సినీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలు కర్ణాటకలో విడుదలైనప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ, తెలుగు సినిమా రేట్ల మాదిరే టికెట్ ధరలు పెంచడంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి అని కోరుతున్నారు.
ఒక నెటిజన్ ఇలా స్పందించాడు: “ఒక డబ్బింగ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచడం సరికాదు. ‘కాంతారా’ కన్నడ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయ్యింది. తెలుగు సినిమాల మాదిరే రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీస్ సినిమాలు చూడలేకపోతున్నాం. ఇది భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ మన సినిమాకాదు కాబట్టి ఇక్కడ రేట్లు పెంచడం అవసరం లేదు.”
కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు
తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు
అక్కడి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు… పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలని స్పష్టం
— I & PR Andhra Pradesh (@IPR_AP) September 30, 2025
ఏపీ ప్రభుత్వం ప్రతిస్పందన
ఏపీ ప్రభుత్వం మాట్లాడుతూ, కర్ణాటక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆ సినిమాలు ఇక్కడ ఇబ్బంది సృష్టించడం తగదు అని, పెద్ద మనసుతో ముందుకెళ్ళాలని సూచించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం శాఖ అధికారులు రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్-1’ టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. “సినిమా అనేది భిన్న భాషల కళల సమాహారం కాబట్టి, పర భాష అని వేరు చూడాల్సిన అవసరం లేదు” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.