Thug Life: 70 ఏళ్ల కమల్‌ లిప్‌లాక్ వివాదం.. ‘థగ్ లైఫ్’ ట్రైలర్ పై నెటిజన్ల ట్రోలింగ్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’ ట్రైలర్‌తో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సన్నివేశాలు నెటిజన్ల ట్రోలింగ్‌కు దారితీశాయి. 70 ఏళ్ల వయస్సులో కమల్‌ యువ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. “ఇలాంటి సీన్లు అవసరమా?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘థగ్ లైఫ్’ ట్రైలర్‌లో కమల్, త్రిషా, అభిరామిల మధ్య వచ్చే సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కమల్ హాసన్‌ – అభిరామి మధ్య లిప్ లాక్ సీన్, త్రిషాతో రొమాంటిక్ దృశ్యాలపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల వయస్సు తేడా ఉన్నా ఇలాంటి సన్నివేశాలు చూపాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

అయితే మరోవైపు కొంతమంది నెటిజన్లు ఈ ట్రోలింగ్‌కి సమాధానం చెబుతున్నారు. “ఇది సినిమా కథలో భాగం మాత్రమే.. పాత్రల అవసరాల ప్రకారం సన్నివేశాలు వస్తాయి” అని స్పష్టం చేస్తున్నారు. “ట్రైలర్ మొత్తం చూడకుండా.. కేవలం ఒక ముద్దు సన్నివేశాన్ని తీసుకొని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా?” అంటూ కొన్ని కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి.

30 ఏళ్ల తర్వాత మళ్లీ మణిరత్నం – కమల్ కాంబో

1987లో వచ్చిన ‘నాయకన్’.. 30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలసి పనిచేస్తుండటం సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తోంది. ట్రైలర్‌లో యాక్షన్, విజువల్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాయి. ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, అభిరామి, సాన్యా మల్హోత్రా, సిలంబరసన్, ఆశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply