ప్రముఖ టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ సందర్భంగా చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో #JrNTR అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఆయన ఆరోగ్యంపై అభిమానులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Breaking News
హైదరాబాద్ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు ..@tarak9999
— YJR (@yjrambabu) September 19, 2025
ఈ విషయంపై ఎన్టీఆర్ టీం స్పందించింది. అధికారిక ప్రకటనలో, షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ స్వల్ప గాయానికి గురైనప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని పేర్కొంది.
అలాగే అభిమానులు, మీడియా, ప్రజలందరూ ఎలాంటి అపోహలు, ఊహాగానాలకు లోనుకాకుండా సహకరించాలని టీం ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరలోనే తిరిగి సాధారణ స్థితికి వస్తారని తెలిపింది.
అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ షూట్ లో Jr.NTR కి తప్పిన ప్రమాదం.. ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలు..@tarak9999 @AnnapurnaStudio #jrntr #annapurnastudio #NTRNeel #adshooting #youngtiger pic.twitter.com/FKTK0qhIJk
— Chitram by Politent (@PolitentChitram) September 19, 2025
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ‘Dragon, Devara’ Part 2 వంటి పెద్ద సినిమాలు ఉండటంతో, ఈ ప్రమాదం ఫ్యాన్స్‌లో టెన్షన్ క్రియేట్ చేసింది. అయినప్పటికీ, ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని టీం నమ్మకం వ్యక్తం చేసింది.