రేపే హరిహర వీరమల్లు విడుదల.. పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ స్పెషల్ మెసేజ్!

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మూవీ యూనిట్ ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే ఈరోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకు మంచి బజ్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో, రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌లో ఆయన ఇలా రాశారు:
“మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా, ఈ సినిమా నిర్మాణంలో కష్టపడ్డ మొత్తం బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply