HariHara VeeraMallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ మరోసారి కొత్త విడుదల తేదీని ప్రకటించింది. గతంలో జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాలేదన్న కారణంతో అప్పుడు సినిమా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ నిరాశ చెందగా, ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టర్‌తో మూవీ యూనిట్ సినిమా జూలై 24న విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించింది.

ఐదేళ్లుగా సాగుతున్న షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దీంతో అభిమానులు ఆనందానికి లోనయ్యారు. సాంగ్స్, ప్రమోషన్లు చూస్తే ఈసారి తప్పకుండా రిలీజ్ అవుతుందన్న నమ్మకమూ ఏర్పడింది. అయితే మరోసారి విడుదల వాయిదా వేయడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.

ఇప్పుడు విడుదల తేదీతో పాటు విలన్ గెటప్‌లోని కొత్త పోస్టర్‌ను కూడా వదిలారు. అయితే, ఈసారైనా సినిమా రిలీజ్ పక్కా అవుతుందా లేక మళ్లీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా అనేది తేలాల్సిందే.

ఇతర సినిమాల రిలీజ్ ప్లాన్స్‌పైనా ఈ చిత్రం ప్రభావం చూపుతోంది. జూలై 25న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం విడుదల కానుంది. పవన్ చిత్రం ముందురోజు విడుదల కావడంతో కింగ్‌డమ్ వాయిదా వేస్తారా? లేక పవన్‌కు పోటీగా బరిలో దిగుతారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ఫైనల్‌గా హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లకు వస్తుంది.

Leave a Reply