Hari Hara Veera Mallu OTT: ఓటీటీలో ‘హరిహర వీరమల్లు’ కొత్త క్లైమాక్స్.. ఎడిట్ మూవీ ఎలా ఉందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన మొదటి పాన్-ఇండియా సినిమా “హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం, థియేటర్ రిలీజ్‌కి కేవలం నాలుగు వారాలకే ఓటీటీలోకి రావడం విశేషం.

ఈ చిత్రం మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమై, ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ చేతిలోకి వెళ్లింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ రావడంతో పాటు, ట్రోల్ల్స్ కూడా రావడంతో కొన్ని టెక్నికల్ మార్పులు చేసి ఓటీటీ వెర్షన్‌గా విడుదల చేశారు.

ఓటీటీలో కొత్త మార్పులు

ఓటీటీలో రిలీజ్ అయిన వెర్షన్‌లో ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్, పవన్ కళ్యాణ్ విల్లు పట్టిన సీన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే వీఎఫ్ఎక్స్ సీక్వెన్స్‌లను కాస్త మెరుగుపరిచారు. కొన్ని భాగాలను పూర్తిగా తొలగించారు కూడా.

ముఖ్యంగా, థియేటర్లలో కనిపించిన బాబీ డియోల్ “ఆంది వచ్చేసింది” అని చెప్పే సీన్‌తో పాటు, ఆయన-పవన్ కళ్యాణ్ మధ్య తుపాను ఫైట్ సీన్‌ను పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలు లేవు. “అసుర హననం” పాట తర్వాతే సినిమా పార్ట్ 2 ప్రకటనతో ముగుస్తుంది.

ఈ మార్పుల వల్ల ఓటీటీలో సినిమా దాదాపు 15 నిమిషాలు తగ్గి, మొత్తం 2 గంటలు 33 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్‌లో ఉంది. థియేటర్‌లో చూసిన వారు, ఓటీటీలో చూస్తే తేడాలను ఈజీగా గమనించగలరు.

ఇప్పటికే హరిహర వీరమల్లు కోసం మూడు వేర్వేరు క్లైమాక్స్‌లను రూపొందించారన్నది ఇండస్ట్రీ టాక్. ఓటీటీలో చూపిస్తున్న వెర్షన్ హోమ్ ఆడియన్స్‌కి అనువుగా ఎడిట్ చేసినదిగా సమాచారం. అయితే ఈ వెర్షన్ ప్రేక్షకులకి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

Leave a Reply