HHVM: ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరి హర వీరమల్లు’కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజులపాటు ప్రత్యేకంగా రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై లోయర్ క్లాస్‌కు రూ.100, అప్పర్ క్లాస్‌కు రూ.150, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.200 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

క్రిష్ దర్శకత్వంలో, జ్యోతికృష్ణ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో జూలై 24న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రిలీజ్ సమయంలో అదనపు కలెక్షన్స్ కోసం సినిమా నిర్మాతలు టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించగా, ప్రభుత్వం మొదటి 10 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం పరిమిత కాలానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

ఇక తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచుకోవాలని నిర్మాతలు ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం రాలేదు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలు, అలాగే విడుదలకు ముందు రోజు జూలై 23 రాత్రి 9.30 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply