Hari Hara Veera Mallu: తక్కువ ధరకే హరిహర వీరమల్లు టికెట్లు.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెండో రోజున కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి. అయినప్పటికీ పవన్ నటన, యాక్షన్ సన్నివేశాలు, ఎంఎమ్ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హై లైట్‌గా నిలిచాయి.

అయితే టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది అభిమానులు ఇప్పటికీ సినిమా చూడలేకపోయారు. ఇప్పుడు వారి కోసం చిత్రబృందం సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. జూలై 28 నుండి ‘హరిహర వీరమల్లు’ టికెట్లు సాధారణ ధరలకే అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బుక్ మై షో మరియు డిస్ట్రిక్ లాంటి యాప్‌లలో ఈ ధరల మార్పులు అమలవుతున్నాయి.

ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్ ధర రూ.175గా ఉండగా, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు రూ.295కే లభిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికీ ఈ సినిమా చూడని ప్రేక్షకులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. మళ్లీ ఈ ధరలకు లభించకపోవచ్చు కాబట్టి ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి!

Leave a Reply