Hansika: హన్సికపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వానీ ఇప్పుడు లీగల్ ఇష్యూలో చిక్కుకున్నారు. ఆమెపై గృహ హింస కేసు నమోదై ఉండటంతో, ఈ కేసును కొట్టివేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

హన్సిక అన్న ప్రశాంత్ మోత్వానీ 2020లో టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ను వివాహం చేసుకున్నాడు. అయితే కేవలం రెండేళ్లకే వారి సంబంధం తెగిపోయింది. విడాకుల ప్రక్రియలో భాగంగా ముస్కాన్ తన భర్తతో పాటు, హన్సిక, ఆమె తల్లి, కుటుంబంపై గృహ హింస ఆరోపణలు చేస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.

ఈ కేసును కొట్టివేయాలని హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి హియరింగ్‌ను జులై 3కు వాయిదా వేసింది.

హన్సిక చిన్నతనం నుంచే సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఆమె ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కోయీ మిల్ గయా’లో మెరిసింది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.

తర్వాత ఎన్టీఆర్‌తో ‘కంత్రి’, రామ్‌తో ‘మస్కా’, ప్రభాస్‌తో ‘బిల్లా’ వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

అయితే, కొంతకాలం తర్వాత హన్సిక బరువు పెరగడం, కొత్త హీరోయిన్ల ఎంట్రీతో తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన హన్సిక, అక్కడ వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

2022 డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్, బిజినెస్‌మ్యాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూనే, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇప్పుడు హన్సికపై ఉన్న గృహ హింస కేసు గురించి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Leave a Reply