బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక జైన్ తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె ధరించిన డీప్ నెక్ డ్రెస్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో పాటు, తీవ్ర ట్రోలింగ్‌కు కూడా గురైంది. ఇప్పటివరకు పద్ధతిగా కనిపించిన ప్రియాంక, ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సినీ, టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ప్రియాంక జైన్ మాత్రం చాలా వరకు సాంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే నటి. బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటిగా దగ్గరైన ఆమె, బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపు పొందింది. కానీ, ఆ షోలోనూ ఆమె గ్లామర్ షో చేయలేదు. అయితే తాజాగా ఓ డ్యాన్స్ షోలో మెంటర్‌గా వ్యవహరిస్తూ హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.
ఈ షో కోసం ప్రియాంక తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ధరించిన బ్లాక్ డ్రెస్‌లో డీప్ నెక్ డిజైన్ ఉండటంతో నెటిజన్లు “ఇంతవరకు సింపుల్‌గా కనిపించిన ప్రియాంక ఇలా మారిపోయిందా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, రెమ్యూనరేషన్ కోసమే ఆమె గ్లామర్ డోస్ పెంచిందని అనేక మంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో ఒక్కో ఎపిసోడ్‌కి ప్రియాంక సుమారు రూ.1.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ పెరిగిన కొద్దీ ఆమె గ్లామర్ షోను పెంచుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పెద్దగా గ్లామర్ ఎక్స్‌పోజ్ చేయని ప్రియాంక, ఈ షోలో మాత్రం తన లుక్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్ట్ చేయడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
“ప్రియాంక ఇంతవరకు ఇలాంటి గ్లామర్ షో చేయలేదు.. ఇప్పుడు ఫుల్ మేకోవర్‌తో కనిపిస్తుండడం షాక్” అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు “ఇది ఆమె వ్యక్తిగత ఇష్టం” అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రియాంక జైన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.