ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తెలుగు తెరపై హీరోగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే అతను నటన, డాన్స్, ఫైట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని సమాచారం.
ఈ సినిమాను ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇక హీరోయిన్గా ఎవరు నటిస్తారన్న ఆసక్తి పెరిగిన సమయంలో, బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఎంపికైనట్లు సమాచారం. అప్పట్లో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో జోడీగా రాషా నటిస్తుందని వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో టాలీవుడ్ ఎంట్రీ మిస్ అయింది. అయితే ఇప్పుడు జయకృష్ణ సినిమా ద్వారా ఆమె అదృష్టం కలిసొచ్చినట్లయింది.
ఇప్పటికే రాషా బాలీవుడ్‌లో ‘ఆజాద్’ అనే సినిమాలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఆ సినిమాలో తన గ్లామర్, డాన్సింగ్ స్కిల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ ప్రారంభ దశలోనే వరుసగా స్టార్ కిడ్స్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం రావడం రాషా కు నిజంగా జాక్‌పాట్ అన్నట్లే.