గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA) 2025 ఆగస్టు 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఇది 5వ ఎడిషన్. తెలుగు సినిమా పరిశ్రమలో 2024లో అద్భుత ప్రతిభను కనబరిచిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను గౌరవించడానికి ఈ వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ‘పుష్ప 2: ది రూల్’ ఘన విజయం సాధించింది. ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా గెలిచారు. మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’లో నటనకు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
ముఖ్య అవార్డులు:
ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటి: మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నిర్మాతలు: అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898 AD)
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: రజాకార్
ఉత్తమ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్: రోషన్ (కోర్ట్)
ఉత్తమ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్: శ్రీదేవి (కోర్ట్) & మానస వారణాశి (దేవకీ నందన వాసుదేవ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు (దేవర)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: భాను మాస్టర్ (‘నల్లంచు తెల్లచీర’ – మిస్టర్ బచ్చన్)
ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ యాక్టర్ (జ్యూరీ): కిరణ్ ఆబ్బవరం (క)
ఉత్తమ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్: హర్ష చెముడు (సుందరం మాస్టర్)
ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్: సత్యదేవ్ (జీబ్రా)
ఉత్తమ యాక్టర్ క్రిటిక్: తేజ సజ్జా
ప్రత్యేక అవార్డులు:
గ్లోబల్ కమెడియన్: బ్రహ్మానందం
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్: అశ్వినీ దత్
గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్: ముట్ల తిరుపతి
ఈ వేడుకలో సత్తా చాటిన ‘పుష్ప 2’ మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ శక్తిని చాటింది.