తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలతో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆయనను ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో “యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 లక్షల సాయం చేశాడు” అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి స్పందించారు.
రెండు కిడ్నీలు పాడయిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాక్టర్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కూతురు చెబుతున్నారు. ప్రభాస్ పీఏ అని ఒకరు కాల్ చేశారు. వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం… pic.twitter.com/01N5lrYrFo
— idlebrain.com (@idlebraindotcom) July 5, 2025
ఒక వీడియో ద్వారా ఆమె చెప్పిన దానిప్రకారం.. “ప్రభాస్ గారు సాయం చేశారనే వార్తల్లో వాస్తవం లేదు. ప్రభాస్ పీఏ అంటూ ఎవరో ఫోన్ చేసి, వివరాలు అడిగారు కానీ ఇప్పటివరకు ఎలాంటి సహాయం జరగలేదు. మేము తిరిగి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ప్రస్తుతం మా నాన్నగారి ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోంది. ఫేక్ వార్తలు పుట్టించి, సహాయం చేయదలచినవారిని దూరం చేయకండి.”
ఆమె చివరగా బాధతో మాట్లాడుతూ.. “ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు ఎవరూ మాకు సహాయం చేయలేదు. ఎవరికైనా సాయం చేసే మనసుంటే చేయండి, కానీ అర్థం లేని ప్రచారాలు మాత్రం మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ టీమ్ దీనిపై స్పందిస్తుందా లేదా అన్నదానిపై ఉంది.