పహల్గామ్ దాడి కలకలం: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా హీరోయిన్ పై విమర్శల వర్షం..!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఫౌజీ’ కూడా వివాదాల్లో చిక్కుకుంది.

ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’లో నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో ఆమె పాత్ర పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ కూతురిగా ఉండటం పలువురు దేశభక్తులను ఆగ్రహానికి గురిచేసింది. ‘‘ఒక శత్రుదేశానికి చెందిన పాత్రను హీరొయిన్‌గా చూపించాలనే ఆలోచన ఎలా వచ్చింది?’’ అంటూ కొందరు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇమాన్వీ ఎవరు? ఆమె నిజ జీవిత నేపథ్యం ఏమిటి?

ఇమాన్వీ అసలు పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్. తల్లి దండ్రులు పాకిస్థాన్ మూలాలు కలవారైనా, ఆమె జననం, పెరుగుదల భారత్‌లోనే.. ఢిల్లీలో జరిగింది. ఎనిమిదేళ్ల వయసులో ఆమె కుటుంబం అమెరికా తరలి వెళ్లింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంబీఏ తరువాత యూట్యూబ్‌లో తన ఛానెల్ ప్రారంభించి లక్షలాది మంది అభిమానులను సంపాదించింది. సోషల్ మీడియాలో ‘ఇమాన్వీ’ అనే పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందింది.

పహల్గామ్ దాడి.. దేశాన్ని కుదిపేసిన సంఘటన

కశ్మీర్‌లోని పహల్గామ్, ప్రకృతి ప్రేమికుల పరవశంగా పేరుగాంచిన ప్రాంతం. కానీ తాజాగా జరిగిన ఉగ్రదాడిలో అదే పర్యాటక కేంద్రం రక్తరంగు కావడం అందరినీ కలచివేసింది. ఈ దాడిలో పర్యాటకులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు వారిపై విచక్షణలేని కాల్పులు జరిపారు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఖండనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపేందుకు సోషల్ మీడియా వేదికవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా స్పందిస్తూ, ‘‘ఇలాంటి అప్రతిష్ట ఘటనలు మానవత్వాన్ని గాయపరుస్తున్నాయి’’ అంటూ తన ట్వీట్ ద్వారా స్పందించారు.

Leave a Reply