Dhanush – Mrunal Thakur: మృణాల్‌తో ధనుష్ డేటింగ్‌? వైరల్ వీడియోలతో హల్‌చల్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు తెరలేపాయి. వీరిద్దరూ తరచూ కలిసి కెమెరాలకు చిక్కుతుండడమే కాకుండా, ఒకరిపై ఒకరు చూపుతున్న ప్రేమ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. అయినప్పటికీ ఈ వార్తలపై ధనుష్ మృణాల్ స్పందించలేదు.

గతంలో ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల తర్వాత నుండి ఆయన వ్యక్తిగత జీవితం గురించి రకరకాల గాసిప్స్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా సీనియర్ నటి మీనాను పెళ్లి చేసుకోనున్నాడని వచ్చిన ప్రచారాన్ని ఆమె స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మృణాల్ ఠాకూర్ పేరుతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

తాజాగా ఆమె పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ పాల్గొనడం, వారిద్దరు కలిసి చేతులు పట్టుకుంటూ కనిపించిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో… “వీళ్లిద్దరి మధ్య ఏదో ఉన్నట్టే!” అంటూ నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు.

అది మాత్రమే కాదు.. మృణాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్‌కు ధనుష్ హాజరవుతుండటంతో గాసిప్స్‌కు మరింత బలం చేకూరింది. ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీరిద్దరూ.. ప్రస్తుతం దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ ‘తేరే ఇష్క్ మే’ లో కలిసి నటిస్తున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ టైమ్‌లోనే పరిచయం బలపడిందని టాక్.

ఇంతకీ మరో విషయం ఏంటంటే – మృణాల్ Spotify ప్లేలిస్ట్‌లో “మామాస్ ఫేవ్స్” అనే సెక్షన్‌లో ధనుష్ సిఫార్సు చేసిన తమిళ పాటలు ఉండటమట..! దీంతో రూమర్లు మరింత ఊపందుకున్నాయి.

అయితే.. ఇది నిజమేనా లేక మరో సోష‌ల్ మీడియా గాసిప్ మాత్రమేనా అనేది.. ధనుష్ లేదా మృణాల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా చిన్నపాటి మిస్టరీగానే మిగిలిపోనుంది..!

Leave a Reply