Kalki 2: కల్కి 2 నుండి దీపికా పదుకునే అవుట్.. మేకర్స్ అధికారిక క్లారిటీ..!

భారతీయ సినిమా చరిత్రలో రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం ‘కల్కి 2898 ఏ.డి’. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్ర పోషించారు. కథంతా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతూ సాగింది.

ఇంత పెద్ద విజయం తర్వాత, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కల్కి 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన అప్‌డేట్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీపికా పదుకునే ఇకపై కల్కి 2లో భాగం కానని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వైజయంతి మూవీస్ తమ X (Twitter) ఖాతా ద్వారా ప్రకటిస్తూ –
“దీపికా పదుకునే కల్కి 2లో భాగం కావడం లేదు. సుదీర్ఘ ఆలోచన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగం చాలా పెద్ద ప్రయాణం. అయితే సీక్వెల్‌కు కావాల్సిన క‌మిట్‌మెంట్ ఆమె నుంచి కనిపించలేదు. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు” అని తెలిపింది.

ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతటి ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకోవడానికి నిజమైన కారణం ఏమిటి? అనేది ఇప్పుడు హాట్ డిబేట్.

గతంలో కూడా దీపికా ప్రభాస్‌తో చేస్తున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటలకంటే ఎక్కువ పనిచేయలేనని ఆమె టీం చెప్పడం, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు నచ్చక, ఆమెను రీప్లేస్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కల్కి 2 విషయంలోనూ అలాంటి అసాధ్యమైన డిమాండ్లు రావడంతో మేకర్స్ రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇప్పుడు ప్రధాన ప్రశ్న – దీపికా స్థానంలో ఎవరు వస్తారు? ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ బాలీవుడ్ నుంచి మరో టాప్ హీరోయిన్‌ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సినిమా ముందే కొన్ని డిలేస్ ఫేస్ చేస్తోంది. ఇప్పుడు దీపికా ఇష్యూ వల్ల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రభాస్ సినిమాల నుంచి వరుసగా రెండు సార్లు తప్పుకోవడం దీపికా కెరీర్‌పై ప్రభావం చూపుతుందా? అనేది చూడాలి. ఆమె పీఆర్ టీం ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అసలు కారణంపై క్లారిటీ రాలేదు.

అయితే ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డ ప్రభాస్-దీపికా కాంబినేషన్‌ను కల్కి సీక్వెల్లో మిస్ అవ్వాల్సిందే అన్నది మాత్రం ఖాయం.

Leave a Reply