Coolie, War 2: అప్పుడే పైరసీ ఎంట్రా.. ‘కూలీ’ మరియు ‘వార్ 2’ HD ప్రింట్ లీక్..!

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే పైరసీకి గురైంది. సినిమాకు సంబంధించిన ఫుల్ HD ప్రింట్ లింకులు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఇప్పటి సినీ ఇండస్ట్రీలో పైరసీ సమస్య తీవ్రమైంది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ లీక్ అవ్వడం కొత్తం కాదు. చిన్న హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా, కొన్ని గంటల్లోనే పైరసీ భూతానికి బలవుతున్నాయి. నేడు విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరియు ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రాలు కూడా పైరసీ లక్ష్యంగా మారాయి. టెలిగ్రామ్ గ్రూపులు, పైరసీ వెబ్‌సైట్లు ఫుల్ HD ప్రింట్ లింకులు ప్రదర్శిస్తున్నాయి.

ఈ క్రమంలో సినీ నిర్మాతలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో #StopPiracy అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మాత్రమే సినిమాలు చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని కోరుతున్నారు.

‘కూలీ’
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన ‘కూలీ’ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. లోకేష్ స్క్రీన్‌ప్లే, రజినీ మార్క్ యాక్షన్, నాగ్ విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిరుధ్ బీజీఎం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ అతిథి పాత్రల్లో అలరించారు.

‘వార్ 2’
ఎన్టీఆర్, హృతిక్ హీరోల ‘వార్ 2’కి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యాక్షన్ స్టెంట్లు అన్ రియలిస్టిక్ గా ఉన్నాయని, సినిమాలో కిక్కిచ్చే పాటలు లేవని, గొప్ప నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, పూర్ స్క్రీన్‌ప్లే సినిమా రివ్యూ లో ప్రధాన మైనస్ గా నిలిచాయి.

Leave a Reply