మెగా స్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను మూవీ టీం సోషల్ మీడియాలో విడుదల చేసింది, ఆ వీడియోలో చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ “వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం” అంటూ చెప్పటం ద్వారా ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపయింది.
Meeting our gang of #Mega157 🤗
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025
ఈ సినిమా ప్రస్తుతం “మెగా 157” అనే పేరుతో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి చేసిన పనిని ప్రత్యేకంగా ప్రదర్శించడానికి తీసిన ఈ వీడియోలో, చిరంజీవి తన అనుభవాలతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన డైలాగ్‌లు కూడా ఉత్సాహభరితంగా ఉండగా, సినిమా ఎలా రూపొందించబడుతుంది అనే అంశంపై అర్థం వచ్చేలా వివరాలు ఇచ్చారు.
ఈ సినిమా కోసం సాహు గారపాటి తో పాటు కొణిదెల సుష్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆమె తన పేరు పరిచయం చేయగానే, చిరంజీవి ఒక చిరునవ్వుతో “ఇంటి పేరు ఏంటి?” అని అడుగుతారు. ఆమె కొణిదెల అని చెప్పగానే, “ఆ పేరును నిలబెట్టు” అని క్షణంలో చెప్పి వెళ్లిపోతారు.
What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥
Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳
SANKRANTHI 2026 – రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr
— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025
ముఖ్యంగా ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ఓపెనింగ్ టీజర్ వీడియో ఇప్పుడు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. “ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం” అని చిరంజీవి, అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచుతోంది.