వీరుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. భారీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వారు దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి స్ట్రీమింగ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేశారు.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, చత్రపతి శంభాజీ మహారాజ్ గాధ ఆధారంగా రూపొందించబడింది. శివాజీ మహారాజ్ మరణానంతరం ముఘల్ సామ్రాజ్యానికి ధీటుగా నిలిచిన శంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలను చూపిస్తూ రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రజల్లో గుండెల్లో గుదిబండలా మిగిలిపోయిన ఈ చిత్రం, అనేక విమర్శలు, చర్చల నడుమ భారీ విజయాన్ని అందుకుంది.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
— Netflix India (@NetflixIndia) April 10, 2025
చిత్రంలో శంభాజీ మహారాజ్ ఎదుర్కొన్న అనేక కష్టాలు, రాజనీతిలో జరిగిన ఆటలు, విశ్వాస ఘాతకుల పాత్ర.. అన్ని దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమాకు, ఓటీటీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఓటీటీ విడుదల తేదీని ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.
ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 11 నుంచి “ఛావా” చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. చారిత్రక నేపథ్యం, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లకు ఈ మూవీ ఓటీటీలో కూడా అదిరే రెస్పాన్స్ వచ్చే అవకాశముంది.