‘మౌనరాగం’ సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక జైన్, తర్వాత ‘జానకి కలగనలేదు’తో మరింత పేరు తెచ్చుకుంది.
ఈ పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5లో నిలిచినా, విన్నర్ కాలేకపోయింది. బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె, వ్యక్తిగత జీవితంతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది.
View this post on Instagram
ప్రియాంక, నటుడు శివకుమార్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కూడా టాక్ ఉంది.
వీరి జంట తరచూ సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
ఇప్పుడోసారి మరోసారి ప్రియాంక-శివకుమార్ జంట చర్చకు వచ్చింది. అమెరికాలో విహరిస్తున్న ఫొటోలు, రోడ్డుపై ముద్దులు పెట్టుకున్న వీడియోలను ప్రియాంక షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
ఈ రొమాన్స్‌పై కొందరు అభిమానులు ప్రశంసలు కురిపిస్తే, చాలామంది నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నడిరోడ్డుపై ఇంత రొమాన్స్ అవసరమా?”, “శోభనం కూడా ఇపుడే కానిచ్చేయండి” అంటూ విమర్శిస్తున్నారు.