Bigg Boss 9 Telugu: ఇట్స్ అఫీషియల్.. ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 9 అప్‌డేట్‌ వచ్చేసింది! వీడియోతో హైప్..!

తెలుగు బిగ్‌బాస్ అభిమానులకు సూపర్ అప్డేట్ వచ్చేసింది. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 9’కు సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. “ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే” అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పవర్‌ఫుల్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. వీడియో ప్రకారం, ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే షో ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నాయి.

తెలుగులో బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్లూ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ అందుకున్నాయి. మొదటి రెండు సీజన్లను ఎన్టీఆర్, నాని హోస్ట్‌ చేయగా, మిగిలిన సీజన్లను నాగార్జున విజయవంతంగా నడిపించారు.

అయితే, 8వ సీజన్‌కు కొంత తక్కువ స్పందన రావడంతో.. తాజా సీజన్‌పై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లు, కాంట్రవర్సీ, ఎమోషన్స్, డ్రామాతో సీజన్‌ను డిజైన్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన వీడియో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ 9పై హైప్‌ మొదలైంది. కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు? ఎప్పటి నుంచి ప్రసారం కానుంది? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Leave a Reply