Nidhhi Agerwal: భీమవరం ఈవెంట్ ప్రభుత్వ వాహనం వివాదంపై నిధి అగర్వాల్ క్లారిటీ..!

ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రేగింది. “On Government Duty” స్టిక్కర్ ఉన్న వాహనంలో ఆమె ప్రయాణించడంతో, ప్రజలు కట్టే పన్నులతో నిర్వహించే ప్రభుత్వ వాహనాలను ప్రైవేట్ ఈవెంట్ కోసం ఎలా వాడతారంటూ నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

సోషల్ మీడియాలో నిధి స్పందన
ఈ వివాదంపై నిధి అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. భీమవరంలోని ఈవెంట్ ఆర్గనైజర్లే తనకు రవాణా సౌకర్యం కల్పించారని, ఆ వాహనం ప్రభుత్వానికి సంబంధించినదని తనకు తెలియదని తెలిపారు. తాను ఏ ప్రభుత్వ అధికారిని వాహనం పంపమని అడగలేదని, ఈ ఘటనకు ప్రభుత్వ అధికారులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వహణ కోసం మాత్రమే ఆ వాహనాన్ని సమకూర్చారని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అభిమానులు వాటిని నమ్మవద్దని కోరారు.

పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అలాగే, ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ లో కూడా ఆమె నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలను త్వరలో విడుదల చేయాలని యూనిట్లు భావిస్తున్నాయి. అదనంగా, మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply