కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? – దేశం మొత్తాన్ని ఊపేసిన ఈ ప్రశ్నకు సమాధానం దొరికి పది సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో భారతీయ సినిమా చరిత్రను మలిచిన ‘బాహుబలి’ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా తదితరులు అభిమానులతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
కాగా, ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా, రాజమౌళి ఓ సర్ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమాను ఇప్పుడు కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో తిరిగి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ స్పెషల్ ఎడిషన్ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.
Baahubali…
The beginning of many journeys.
Countless memories.
Endless inspiration.
It’s been 10 years.Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.
In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g
— rajamouli ss (@ssrajamouli) July 10, 2025
ఇప్పటికీ అదే క్రేజ్!
బాహుబలి సినిమా పదేళ్లు గడిచినా, ప్రేక్షకుల్లోని క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు… అన్నింటితో ఈ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా నిలబెట్టింది.
బాహుబలి, భల్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప లాంటి పాత్రలు అభిమానుల గుండెల్లో చెరగని గుర్తుగా మిగిలిపోయాయి.
ఇప్పుడు ఈ విజువల్ వండర్‌ని మరోసారి పెద్ద తెరపై చూడటానికి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.