Anushka Shetty: అనుష్క షాకింగ్ నిర్ణయం.. కొన్ని రోజులు బ్రేక్.. వైరల్ అవుతున్న లెటర్..!

ఈ మధ్య డిజిటల్ డీటాక్స్ ట్రెండ్‌ను అనేక మంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. కొంతకాలం సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్నారు. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (స్వీటీ) కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాకు కొంతకాలం బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా ఒక నోట్ ద్వారా ప్రకటించారు. ఆ లెటర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

అనుష్క తన నోట్‌లో ఇలా రాశారు: ‘‘కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే జీవితానికి దూరంగా.. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. త్వరలోనే మరిన్ని మంచి కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను’’ అని పేర్కొన్నారు. ఈ లెటర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అనుష్క ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారనే విషయంపై అభిమానులు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా ఆమె చిన్న హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారని, అందుకే ‘ఘాటీ’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇటీవల అనుష్క నటించిన ‘ఘాటీ’ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగింది. ఇందులో అనుష్క శీలావతి పాత్రలో నటించారు. సాధారణ గిరిజన మహిళగా మొదలై స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రాణిగా ఎదిగిన కథ ఇందులో చూపించారు.

అరుంధతి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హిట్స్ ఇచ్చిన అనుష్క నుంచి ‘ఘాటీ’తో కూడా అదే ఆశించారు అభిమానులు. కానీ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది.

‘బాహుబలి’ తర్వాత అనుష్క కేవలం ఒకే సినిమా చేసింది. దీంతో స్వీటీ నుంచి కొత్త సినిమాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తన నోట్‌లో కూడా త్వరలోనే మంచి ప్రాజెక్ట్స్‌తో వస్తానని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply