Ghaati Trailer: ఘనంగా విడుదలైన అనుష్క ‘ఘాటి’ ట్రైలర్.. వెండితెరపై జేజమ్మ విశ్వరూపం మళ్లీ!

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా మూవీ ‘ఘాటి’ ట్రైలర్ విడుదలైంది. గంజాయి మాఫియా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క మరోసారి ‘అరుంధతి’ తరహాలో రోల్ చేసిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. యాక్షన్, రక్తపాతం, డైలాగ్స్.. అన్నీ ట్రైలర్లోనే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఫస్ట్‌లుక్ వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ‘ఘాటి’పై.. ట్రైలర్ రాకతో హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా మొదట ఏప్రిల్‌ 29, ఆ తర్వాత జూలై 11న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వాయిదాలు పడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఫైనల్‌గా సెప్టెంబర్‌ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాను తెలుగు‌తో పాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు.

రెండు సంవత్సరాల తర్వాత అనుష్క మరోసారి పకడ్బందీగా తెరపై కనిపించనుంది. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ రీ-ఎంట్రీ ఇచ్చిన అనుష్కకు, ఈ ‘ఘాటి’ మరొక సాలిడ్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో వేచి చూడాలి!

Leave a Reply