యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను ఏకంగా ఓ ఐపీఎల్ టీమ్ ఓనర్‌తో ఏడు అడుగులు వేయబోతున్నాడట!
పాన్ ఇండియా సినిమాలకి సంగీతం అందిస్తూ క్రేజ్ అందుకున్న అనిరుధ్.. రజనీకాంత్, విజయ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రొఫెషనల్‌గా టాప్ లో ఉన్నా, పర్సనల్ లైఫ్ మాత్రం తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటుంది. గతంలో పలువురు హీరోయిన్లతో అనిరుధ్ పేరు వినిపించినా, ఎప్పుడూ అవి గాసిప్‌గానే మిగిలిపోయాయి.
కానీ ఈసారి విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అందరూ ‘కావ్య పాప’గా పిలిచే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు ఓనర్ కావ్య మారన్‌తో అనిరుధ్ డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతోంది. అంతే కాకుండా, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కావ్య పాప ఎవరు?
కావ్య మారన్ – మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన ఆమె.. ఐపీఎల్ మ్యాచుల్లో హాజరై తన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెట్టింట్లో ఫేమస్ అయింది. స్టార్ హీరో రజనీకాంత్ ఆమె గురించి ఓ ఈవెంట్లో ప్రత్యేకంగా చెప్పిన తర్వాత అభిమానులు ఆమెను “కావ్య పాప”గా పిలవడం ప్రారంభించారు.
ఇప్పుడు అనిరుధ్-కావ్య జంటపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఇద్దరి మధ్య ఫ్యామిలీ కనెక్షన్ కూడా చర్చనీయాంశంగా మారింది. సన్ గ్రూప్ నిర్మించిన కొన్ని సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించాడు. దీంతో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ వార్తలపై ఇరు వైపులా ఎటువంటి అధికారిక స్పందన లేదు. కానీ ఓ విషయమైతే స్పష్టమే.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది!