Anaganaga Oka Raju: ఏం ఫీలుతుంది మామ.. ‘అనగనగ ఒక రోజు’ 2026 సంక్రాంతికి థియేటర్స్ లో..!

నవీన్ పోలిశెట్టి-మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగ ఒక రోజు’ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా సినిమాపై ప్రోమో విడుదల చేశారు. రెగ్యులర్ గ్లిమ్ప్స్ ఫార్మాట్ కాకుండా, ఈ ప్రోమో కొంత ప్రత్యేకంగా, యాడ్ షూట్ కాన్సెప్ట్ లో రూపొందించబడింది. ప్రోమోలో ఒక స్పూఫ్ జ్యువెలరీ యాడ్ ద్వారా ప్రారంభించి, ఆ తర్వాత సినిమా విజువల్స్ చూపించడం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.

ప్రోమోలోని విజువల్స్ పండుగ ఉత్సాహంతో నిండినవి. రంగురంగుల సెట్‌లు, హీరో మాస్ మూమెంట్స్, కామెడీ, రొమాన్స్ అన్నీ కలిసి సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచాయి.

కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి రాజు పాత్రలో నటిస్తున్నారు. కథ పెళ్లి నేపథ్యంతో మలుపు తిరుగుతూ, హీరో తన పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా, అంట్ అంబానీ స్థాయిలో చేసుకోవాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అతడి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో, అసలు పెళ్లి జరుగుతుందో అని సినిమాకి కేంద్రీకృత కథగా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే చిన్న టీజర్ వీడియో విడుదల అయింది. నవీన్ లుంగీ, బనియన్, పారాగన్ చెప్పులతో పల్లెటూరి కుర్రాడిగా మాస్ లుక్ లో కనిపించాడు. టీజర్ లో నవీన్ పొలిశెట్టి ఇచ్చిన డైలాగ్స్, అంతా అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది.

Leave a Reply