Mahabharata: ఆమిర్ ఖాన్ 30 ఏళ్ల కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ పై కీలక అప్‌డేట్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్‌ అయిన ‘మహాభారతం’ పై పూర్తి దృష్టి పెట్టాడు. ఈ ఇతిహాస ప్రాజెక్ట్‌ను తాను సాధారణ సినిమాగా కాకుండా, ఒక ఆధ్యాత్మిక యజ్ఞంలా రూపొందించాలని కోరుకుంటున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌‌పై కీలక వివరాలు షేర్ చేశారు.

ఆమిర్ మాట్లాడుతూ, “మహాభారతం కోసం నేను దాదాపు 30 ఏళ్లుగా కలలు కంటున్నాను. ఇది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇప్పటికే పలు దశల్లో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే రెండు నెలల్లో స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం అందరూ సిద్ధంగా ఉండాలి. ఇది సినిమా కాదు, ఒక ఆధ్యాత్మిక యజ్ఞంలా భావిస్తున్నాను” అని తెలిపారు.

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను ఒకే భాగంగా కాకుండా సిరీస్‌ల రూపంలో రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. మహాభారతం కేవలం కొన్ని గంటల్లో చెప్పే కథ కాదు. దీని వెనక ఉన్న భావాలు, పాత్రల లోతు, సంక్లిష్టత అన్నీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా రూపొందించాలనుకుంటున్నాడు ఆమిర్.

ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కోసం కథపై మాత్రమే పని జరుగుతోంది. కథ పూర్తి అయిన తరువాతే నటీనటుల ఎంపిక ప్రారంభమవుతుంది. ఇండస్ట్రీకి చెందిన అనేక మంది టాలెంటెడ్ డైరెక్టర్లు, రచయితలు ఈ ప్రాజెక్ట్‌పై కలిసి పని చేస్తారని తెలిపారు.

ఇక ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ‘లాహోర్: 1947’ సినిమా కోసం సైన్ చేశారు. ఈ సినిమా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనుండగా, సన్నీ డియోల్ ఇందులో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. గతంలో ‘సితారే జమీన్ పర్’, ‘కూలీ’ సినిమాలతో మంచి ఆదరణ పొందిన ఆమిర్, మహాభారతం ప్రాజెక్ట్‌తో మరోసారి తన సత్తాను నిరూపించడానికి సిద్ధమవుతున్నాడు.

మొత్తానికి, 30 ఏళ్ల కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ కోసం స్క్రిప్ట్ వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. సినిమా కాకుండా సిరీస్‌గా రూపొందించబడే ఈ ప్రాజెక్ట్‌కు ఇండస్ట్రీలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేయనుంది.

Leave a Reply