ఈరోజు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న బన్నీ.. కొన్ని రికార్డులతో అయితే ఇండస్ట్రీలో మైలురాయిలు నెలకొల్పాడు. అలాంటి అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇప్పుడు చూద్దాం.
1. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలిచిన తొలి తెలుగు హీరో
2023లో “పుష్ప: ది రైజ్” చిత్రంలో తన పోషించిన పాత్రకు గాను బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
2. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడు
2022లో అల్లు అర్జున్ “ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును ఎంటర్టైన్మెంట్ విభాగంలో గెలుచుకున్నాడు. దక్షిణాది నుండి ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి నటుడిగా నిలిచాడు.
3. ‘పుష్ప 2’తో ₹1831 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన స్టార్
“పుష్ప 2” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించి, దేశంలోనే రెండవ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ నిలిపింది.
4. భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న టాప్ ఇండియన్ హీరో
2024లో బన్నీ “పుష్ప 2” కోసం దాదాపు ₹300 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రేర్ ఫీట్.
5. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రాతినిధ్యం వహించిన స్టార్
2024లో జరిగిన 74వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతీయ సినిమాను ప్రాతినిధ్యం వహించిన స్టార్‌గా అల్లు అర్జున్ చరిత్రలో నిలిచాడు.
6. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం పొందిన దక్షిణాది నటుడు
దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీకి మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం తో.. ఈ గౌరవం పొందిన ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా గుర్తింపు పొందాడు.
7. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ యాక్టర్
అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఒక సౌత్ ఇండియన్ హీరోకే సొంతమైన రికార్డు.
8. టాలీవుడ్లో మొదటి సిక్స్ ప్యాక్ హీరో
“దేశముదురు” సినిమాలో తన సిక్స్ ప్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన బన్నీ.. టాలీవుడ్లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇలాంటి రికార్డులతో బన్నీ తన అభిమానులను గర్వపడేలా చేస్తూ, ఇండియన్ సినిమా రంగంలో తనదైన మార్క్ వేసుకుంటున్నాడు.
హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్!