#AA22xA6: అల్లు అర్జున్-అట్లీ కాంబోలో దీపికా పదుకొనె.. గ్లింప్స్ వీడియోతో దుమ్మురేపింది..!

పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌పై మేకర్స్ మరో సెన్సేషనల్ అప్డేట్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ముఖ్య పాత్రలో నటించనున్నారు. దీపికా పాత్రను పరిచయం చేస్తూ ఒక ఇంటెన్స్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

యాక్షన్ మోడ్‌లో దీపికా..
ఇంట్రడక్షన్ వీడియోలో దీపికా శిక్షణ తీసుకుంటున్న యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఆమె పాత్ర పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇదే చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. అయితే, అధికారికంగా ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

బన్నీ మూడు గెటప్పులా..?
ఇన్‌సైడ్ సోర్సెస్ ప్రకారం, బన్నీ ఈ సినిమాలో మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. తద్వారా ముగ్గురు హీరోయిన్లతో ముగ్గురు వేరువేరు పాత్రల జోడీగా అల్లు అర్జున్ స్క్రీన్‌ను షేక్ చేయనున్నాడు. అట్లీ దర్శకత్వంలో బన్నీని ఒక భిన్నమైన లుక్‌లో చూపించేందుకు ఇప్పటికే ముంబై బాంద్రా మోహబూబా స్టూడియోలో లుక్ టెస్ట్‌లు కూడా నిర్వహించినట్లు సమాచారం.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో..
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. షూటింగ్ 2025 ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యలో ప్రారంభం కానుంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందనున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అల్లు అర్జున్, దీపికా పదుకొనె, అట్లీ లాంటి భారీ కాంబినేషన్‌కు ఇది తగిన రీతిలో సంచలనం రేపే సినిమాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply