టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’. మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, నరేష్ కెరీర్‌లో 63వ చిత్రం. రుహాని శర్మ కథానాయికగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘ఆల్కహాల్’ టీజర్ మంచి ఆకట్టుకుంటోంది. “లక్షలు లక్షలు సంపాదిస్తావు కానీ మందు తాగవు.. ఇంకా ఎందుకు నీ బతుకు?” అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. అలాగే “తాగుడికి సంపాదనకే లింక్ ఉంది.. తాగితే ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు నచ్చదు” అనే నరేష్ డైలాగ్‌లు కూడా ప్రభావితం చేస్తున్నాయి.
Where there’s a HIGH 🍻… there’s a PRICE 💵#Alcohol Teaser is out now 💥
— https://t.co/twXwKZJ7r7Releasing worldwide on 1st Jan 2026! 🍾@allarinaresh @iRuhaniSharma @JustNiharikaNm @mehertej2 @vamsi84 #SaiSoujanya @chaitanmusic @GhibranVaibodha @NiranjanD_ND @jsp2086… pic.twitter.com/VzvEY5mpig
— Sithara Entertainments (@SitharaEnts) September 4, 2025
టీజర్ చూస్తుంటే ఈ సినిమా ప్రధానంగా కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతుందనే అంచనా వేయవచ్చు.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం 2026 జనవరి 1న గ్రాండ్‌గా రానుంది.