Akkada Ammayi Ikkada Abbayi: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ రివ్యూ: ప్రదీప్ మాచిరాజు కామెడీ ఎంటర్టైనర్ ఎలా వుంది?

బుల్లితెర యాంకర్‌గా పేరుగాంచిన ప్రదీప్ మాచిరాజు రెండోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నితిన్-భరత్ లు కలిసి మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. కమర్షియల్ గానూ, ప్రేక్షకులకు సరదాగా ఉండేలా చేసిన ప్రయత్నమే ఈ సినిమా.

కథలోకి వెళ్తే
భైరిలంక అనే ఊరిలో జనరేషన్‌లుగా ఆడపిల్లలు పుట్టడం లేదు. ఒక రోజు ఆ ఊరిలో పుట్టిన ఓ అమ్మాయి వల్ల వర్షాలు కురుస్తాయి, కరువు తొలుగుతుంది. ఆ అమ్మాయి అంటేనే రాజకుమారి (దీపికా పిల్లి). ఆమెను ఊరు వదలకుండా, అక్కడే పెళ్లి చేసుకోవాలంటే ఊర్లోని 60 మంది మగవాళ్ల మధ్య పోటీ పెరగడం మొదలవుతుంది. ఇదే సమయంలో సివిల్ ఇంజినీర్ కృష్ణ (ప్రదీప్) బాత్రూమ్స్ నిర్మాణ పనులతో ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. అక్కడే ఆయన రాజతో ప్రేమలో పడతాడు. ఇక రాజ-కృష్ణల ప్రేమను ఊరు ఎలా చూసింది? వీరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నదే మిగతా కథ.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్లస్ అండ్ మైనస్

కథ ఆరంభం కొత్తగానే అనిపిస్తుంది. ఒకే అమ్మాయి కోసం ఊరంతా పోటీ పడటం, బయట వ్యక్తి ప్రేమలో పడితే ఊరిలో కలకలం – ఇవన్నీ వినడానికి వింతగా, స్క్రీన్‌పై వినోదంగా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రదీప్, సత్య, గెటప్ శ్రీను వంటి నటుల హాస్యమయం సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బాగానే ఉండగా, సెకండ్ హాఫ్ కొంచెం డీలా పడింది. కొన్ని సీన్స్ అసంపూర్తిగా అనిపించాయి కానీ, క్లైమాక్స్‌ మాత్రం ఎమోషన్‌తో కలిసి ఆకట్టుకునేలా తీశారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నటీనటుల ప్రదర్శన

ప్రదీప్ పాత్రలో తన మార్క్ కామెడీ పర్ఫెక్ట్‌గా నిండింది. దీపికా పిల్లి తొలి సినిమా అయినప్పటికీ స్క్రీన్‌పై గ్రేస్‌తో కనిపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఝాన్సీ, జెమిని కిరణ్, మిగిలిన వారు తగినంతగా సహకరించారు.

టెక్నికల్‌గా..
విజువల్స్ రిచ్‌గా ఉన్నాయ్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. కథకు తగ్గ స్క్రీన్‌ప్లే, ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. డైరెక్టర్లు నితిన్-భరత్ తమ తొలి సినిమాతోనే మంచి ప్రయత్నం చేశారు.

మొత్తంగా చెప్పాలంటే…
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఒక వినోదభరితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ పెద్ద హైలైట్, సెకండ్ హాఫ్ ఓకే అనిపించినా, ఎండింగ్ ఫీలింగ్ బాగుంది. కామెడీ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఇది తప్పకుండా నచ్చుతుంది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కి ప్రజ్ఞ మీడియా ఇచ్ఛే రేటింగ్: 3/5

Leave a Reply