Akhanda 2: ‘అఖండ’ పాప పెద్దయ్యాక అఖండ 2 లో ఇలా.. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..?

బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులలో భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది.

అఖండ 2లో ఒక కీలక పాత్రను తాజాగా పరిచయం చేశారు. బాలీవుడ్‌లో ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమాలో చిన్నారి మున్నీగా మనందరినీ కట్టిపడేసిన హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by 14 Reels Plus (@14reelsplus)

‘అఖండ’ మొదటి పార్ట్ చివర్లో, బాలయ్య నటించిన అఖండ స్వామి పాపకు “నిన్ను కాపాడేందుకు ఎప్పుడైనా వస్తాను” అనే మాట ఇస్తాడు. ఆ పాపే ఇప్పుడు పెద్దయ్యాక జననిగా మనముందుకు రాబోతోంది. పాపకి సమస్య వస్తే అఖండ మళ్లీ ప్రత్యక్షమవుతాడన్న ప్లాట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హర్షాలీ మల్హోత్రాను తీసుకోవడం స్టోరీకి మరింత బలాన్ని ఇవ్వనుంది. జనని అనే ఈ పాత్రలో ఆమెను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించబోతోంది. ఈసారి ‘అఖండ 2’ పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో బాలీవుడ్ మార్కెట్‌నే లక్ష్యంగా చేసుకుని హర్షాలీని కాస్ట్ చేశారని అంటున్నారు.

చిన్నప్పుడు మున్నీగా దేశమంతా గుర్తుపెట్టుకున్న హర్షాలీ ఇప్పుడు హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది. హిందీలో ‘నాస్తిక్’ అనే సినిమాలో నటిస్తున్న ఆమెకు తెలుగులో ‘అఖండ 2’తో గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

Leave a Reply