అజిత్ కుమార్, త్రిష జంటగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల అయింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ప్రసన్న, సునీల్, అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్ వంటి తారాగణం ఉన్నారు.
కథలోకి వెళితే, ‘AK’ అలియాస్ రెడ్ డ్రాగన్‌గా అజిత్ డాన్ పాత్రలో కనిపిస్తాడు. తను గతాన్ని వదిలి జైలుకు వెళ్లినా, కొడుకు కోసం జీవితంలోకి మళ్లీ అడుగుపెడతాడు. స్పెయిన్‌లో ఉన్న తన కొడుకును కలుసుకోవడానికి వచ్చిన AK, అనుకోని మలుపుల వల్ల మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు. తన కొడుకు డ్రగ్స్ కేసులో ఇరికించబడడం, గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేయడం.. ఇవి కథలో కీలకంగా మారతాయి.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో ఎలివేషన్స్, ఇంట్రో డాన్ టచ్ బాగుంది.
సెకండ్ హాఫ్‌లో వింటేజ్ అజిత్ ఫ్లాష్‌బ్యాక్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా మారుతుంది.
యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్నేషనల్ విలన్స్ అప్‌గ్రేడ్‌గా ఉన్నాయి.
బీజీఎమ్, కెమెరా వర్క్ హైలైట్.
మాతృభాష అజిత్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఓ ఫుల్ ప్యాకేజీ ఫెస్టివల్ లాంటి ఫీల్ ఇస్తుంది.
మైనస్ పాయింట్స్:
కథ కొత్తది కాదు, చాలా సినిమాల్లో ఇదే పాత ఫార్ములా.
సాంగ్స్ డీసెంట్ గానే ఉన్నా, సింక్ కాదనిపిస్తుంది.
మాస్ ఎలిమెంట్స్ బాగున్నా, కామన్ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు.
నటీనటుల పనితీరు:
అజిత్ ఎప్పటిలాగే డాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. త్రిష క్యూట్ గానూ, కార్తీక్ దేవ్ బాగా నటించాడు. సునీల్, అర్జున్ దాస్, ప్రసన్న లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే నటించారు.
టెక్నికల్‌గా:
కెమెరా, విజువల్స్, BGM హై క్లాస్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా కార్స్, గన్స్ లు రిచ్‌గా చూపించింది. డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కథ పాతదే అయినా తన డైరెక్షన్ తో అజిత్ ఫ్యాన్స్ ని మెప్పించాడు.మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.
ఫైనల్ వెర్డిక్ట్:
పాత కథ, కొత్త ప్యాకింగ్. అజిత్ ఫ్యాన్స్‌కి మాత్రం పండగే.
ప్రజ్ఞ మీడియా రేటింగ్: 2.75/5