Good Bad Ugly Trailer: అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్‌.. మాస్, క్లాస్ లుక్స్‌తో ఫాన్స్ కి ఫుల్ కిక్!

ఇండస్ట్రీలో మాస్ కి అసలైన నిర్వచనం ఇచ్చే హీరోలలో అజిత్ ముందుంటాడు. ట్రైలర్ చూస్తుంటే అజిత్ ఈసారి రెగ్యులర్ ఫార్ములా కాకుండా, మూడు వేర్వేరు షేడ్స్‌లో పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గుడ్, బ్యాడ్, అగ్లీ.. టైటిల్ చెప్పినట్టే పాత్రలో మూడు వేరియేషన్స్ చూపించబోతున్నాడు.

అజిత్ లుక్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ట్రైలర్ మొత్తంలో ఆయనే హైలైట్. ఒక్కో సీన్‌కి ఓ వేరియేషన్ ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, మాస్ డైలాగ్స్, స్లో మోషన్ ఎంట్రీలు.. అన్నీ ఫాన్స్ కోసమే. కమర్షియల్ సినిమాకి కావలసిన మాస్ మసాలా అన్నీ ఉన్నాయి.

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాస్ పుల్లింగ్ ఎలా చేయాలో బాగా అర్థం చేసుకున్నట్టు ట్రైలర్ స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్‌నెస్ ఉంది. ఫైట్స్, డైలాగ్స్, హెవీ బిల్డ్‌అప్ సీన్స్… టార్గెట్ ఆడియెన్స్ కి అవసరమయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయ్.

ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే, జివి ప్రకాశ్ మరోసారి తన మార్క్‌ చూపించాడు. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందమైన థ్రిల్ కలిగించేలా ఉంది. థియేటర్ ఎఫెక్ట్ బలంగా ఉండేలా కంపోజ్ చేశాడు.

త్రిష, అర్జున్ దాస్, సిమ్రాన్, యోగి బాబు లాంటి పేరున్న నటులతో కాస్టింగ్ వాల్యూస్ పెరిగాయి. అర్జున్ దాస్ విలన్‌గా ఫుల్ యాటిట్యూడ్ చూపించాడు. త్రిష పాత్ర కూడా స్టైలిష్‌గా ఉండేలా కనిపిస్తోంది.

ట్రైలర్ మొత్తానికి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి కమర్షియల్ ప్యాకేజ్. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అజిత్ ఫ్యాన్స్‌కు ఇది మరో ఫెస్టివల్ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

Leave a Reply