నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘‘రాబిన్‌హుడ్’’ సినిమాలోని ‘‘అదిదా సర్‌ప్రైజ్’’ స్పెషల్ సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో ఫుల్ వీడియో రూపంలో విడుదలైంది. అయితే ఈ పాటలో కేతిక శర్మ వేసిన స్టెప్పులను థియేటర్లలో మర్చినట్టే యూట్యూబ్ వెర్షన్‌లోనూ చూపించకపోవడం గమనార్హం.
ఈ పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్, మిమ్స్‌తో వైరల్ అయినప్పటికీ, థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు అసలు ఆ హైలైట్ స్టెప్పు లేకపోవడం షాకిచ్చింది. తాజాగా ఏప్రిల్ 7న విడుదలైన వీడియో సాంగ్ లో కూడా అదే వెర్షన్‌ను పెట్టారు.
ఈ సాంగ్‌కి సంబంధించి ఒకే ఒక్క స్టెప్పు కారణంగా సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. కేతిక శర్మ చేసిన ఆ డ్యాన్స్ మూమెంట్‌ను రీమూవ్ చేయడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మూవీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కిన ‘‘రాబిన్‌హుడ్’’ మార్చి 28న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయినా ‘‘అదిదా సర్‌ప్రైజ్’’ పాట మాత్రం విమర్శలతో పాటు పాపులారిటీ కూడా తెచ్చుకుంది. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయినా.. మిస్ అయిన స్టెప్పు ఫ్యాన్స్‌కి తప్పనిసరిగా అసంతృప్తినే మిగిల్చింది.