TET 2025: టెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..!

TET 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ:

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2025 దరఖాస్తులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, ఈ నెల 11న తొలి విడత టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

పరీక్ష రీత్యా వివరాలు:

పేపర్-1 (జూనియర్ స్కూల్ టీచర్ జాబ్స్ కోసం)

పేపర్-2 (సీనియర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం)

ఫీజులు:

ఒక పేపర్‌కు: రూ. 750

రెండు పేపర్లకు: రూ. 1000

అప్లికేషన్ దాఖలులో చివరి తేదీ: ఏప్రిల్ 30
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు: జూన్ 9 నుంచి
పరీక్ష తేదీలు: జూన్ 15-30
ఫలితాల విడుదల: జులై 22

TET 2025 దరఖాస్తు విధానం:

TGTET అధికారిక వెబ్‌సైట్ (tgtet.aptonline.in) ను ఓపెన్ చేయండి.

హోమ్‌పేజీలో “TGTET 2025 రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.

సైన్ అప్ చేసుకుని, అడిగిన వివరాలు ఫామ్‌లో నింపండి.

దరఖాస్తు ఫీజు చెల్లించండి.

ఫామ్‌ను సమర్పించండి.

రసీదు ఫామ్‌ను సేవ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

గమనిక: ఈ పరీక్షకు మొత్తం దాదాపు 2 లక్షల మంది పోటీపడనున్నారు. గత జనవరిలో జరిగిన 2024 టెట్-2 పరీక్షకు 2,05,278 మంది హాజరయ్యారు.

Leave a Reply