TS TET 2025: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

తెలంగాణ టెట్ (TET) – 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా టెట్ ప్రత్యేక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అధికారిక వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/ లోకి వెళ్లండి.

హోం పేజ్‌లో “Hall Ticket Download” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

పరీక్షల షెడ్యూల్:

జూన్ 18, 19: పేపర్ 2 (మ్యాథ్స్, సైన్స్)

జూన్ 20–23: పేపర్ 1

జూన్ 24: పేపర్ 1 & పేపర్ 2

జూన్ 27: పేపర్ 1

జూన్ 28–30: పేపర్ 2 (మ్యాథ్స్ & సైన్స్ – ఒక్క సెషన్‌లో)

ఫలితాలు:

పరీక్షల అనంతరం ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 22న టెట్ తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Leave a Reply