తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్ టెన్షన్ కాస్త తీరబోతోంది. ఎందుకంటే… 2025 ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఎక్కడ చూసుకోవాలి..?
ఫలితాలను చూడాలంటే… ఈ వెబ్‌సైట్లను ఓపెన్ చేయండి:
ఫలితాలను చూసేందుకు హాల్ టికెట్ నంబర్ తప్పనిసరిగా అవసరం. ఫలితాలు స్క్రీన్ మీద కనిపించిన తర్వాత, అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు… ఓ ప్రింట్ తీసుకోడమైతే మంచిదే.
ఫలితాల చెక్ చేసే విధానం:
మీరు ఓపెన్ చేసిన వెబ్‌సైట్‌లో “TG Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
తర్వాత ఎగ్జామ్ ఇయర్, స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్), హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
“Get Memo” క్లిక్ చేస్తే ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుంది.
ఫలితాల్లో ఏమైనా డౌట్ ఉందా?
అయితే మీరు రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం అప్లై చేయవచ్చు.
రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100
రీ-వెరిఫికేషన్‌కు రూ.600 చెల్లించాలి.
ఇవి అన్ని ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
మే-జూన్ 2025లోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో తాత్కాలికం మాత్రమే. అసలు మార్కుల మెమో మీరు మీ కాలేజీ నుంచే తీసుకోవాలి. లేదా డిజిలాకర్ ద్వారా డిజిటల్ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు SMS ద్వారా చూడాలంటే:
TGGEN1 (for First Year General)
TGGEN2 (for Second Year General)
అని టైప్ చేసి 56263కి పంపించండి.
ఇక గత ఏడాది ఫలితాల పరిస్థితి ఏంటి?
2024లో
ఫస్ట్ ఇయర్ పాస్ శాతం: 60.01%
సెకండ్ ఇయర్ పాస్ శాతం: 64.19%
బాలికల పాస్ శాతం: 68.35%
బాలుర పాస్ శాతం: 51.50%
రంగారెడ్డి & ములుగు జిల్లాలు టాప్‌లో నిలిచాయి.
ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్‌ను డిసైడ్ చేసేంత ముఖ్యమైనవి. అందుకే… ఏ చిన్న తప్పూ కనిపించినా, వెంటనే మీ కాలేజీని సంప్రదించండి. పేరెంట్స్ కూడా పిల్లలకి సపోర్ట్‌గా ఉండాలి.
చివరగా చెప్పాలంటే…
ఏమైపోయినా స్ట్రెస్ పడకుండా… కూల్‌గా ఫలితాలు చూసుకోండి. మీరు పెట్టిన కష్టానికి మంచి ఫలితం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం!