తెలంగాణ ICET 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా?

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ICET 2025 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా ప్రకటించింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంక్‌లు, ర్యాంక్ కార్డు తదితర వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://icet.tgche.ac.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

ఈ ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయించబడతాయి.

ఈ సంవత్సరం TG ICET పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండ తరఫున TGCHE నిర్వహించింది.

Leave a Reply