Group 1 రేపే తెలంగాణ గ్రూప్ 1..?

Group 1 రేపే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల..?

group 1 తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీ నవంబర్‌ 15 విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రైమరీ ఆన్సర్‌ కీతోపాటు ఓఎంఆర్‌ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఓటీఆర్ లాగిన్ ద్వారా ప్రాథమిక కీ, ఓఎమ్ఆర్ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ వివరాలతో లాగినై ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకోవచ్చు. నవంబర్ 29 సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ పత్రాలను ఉంచనున్నారు. మొత్తం 2,85,916 ఓఎమ్ఆర్ కాపీలను స్కానింగ్ చేసినట్లు తెలిపారు.ఈ కీపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను లేవనెత్తడానికి 5 రోజుల గడువు ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు.ఇక ప్రిలిమినరీ కీపై మొత్తం 10 ప్రశ్నలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది Read More

దీనిలో ఒక్కప్రశ్నకు మాత్రం ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రశ్నను డిలీట్ చేస్తే.. అందరికీ ఒక మార్కు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన ప్రశ్నల్లో రెండు నుంచి మూడు ప్రశ్నల వరకు రెండు జవాబులు ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా.. ప్రింటింగ్ మిస్టేక్ తో మరో మార్కు కూడా కలవనున్నట్లు సమాచారం. త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది.

click here

Leave a Reply