ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు బుధవారం ఉదయం అధికారికంగా విడుదలయ్యాయి. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 81.14%. బాలురలో 78.31 శాతం, బాలికల్లో 84.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు: ఈసారి రాష్ట్రంలోని మొత్తం 1,680 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 19 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అత్యధిక ఉత్తీర్ణత శాతం (93.90%)తో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

మంత్రి లోకేశ్ స్పందన: ఫలితాల సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విజయవంతంగా పదో తరగతిని పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా, మే 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.

ఫలితాలు ఇలా చెక్ చేయండి:
వెబ్‌సైట్‌ల ద్వారా ఫలితాలు చూసేందుకు:

https://bse.ap.gov.in

https://apopenschool.ap.gov.in

వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా?:

మీ మొబైల్ వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయండి.

“సేవను ఎంచుకోండి” అనే ఆప్షన్ వస్తుంది – దాన్ని సెలెక్ట్ చేయండి.

“విద్యా సేవలు”ను ఎంచుకోండి.

“SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ రోల్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

PDF కాపీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply