AP DSC Results: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు 2025.. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరు కార్డ్ డౌన్‌లోడ్ లింక్

ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ప్రకటన ప్రకారం, ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తుది కీ విడుదల తర్వాత, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సవరణలు చేసి, నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా తుది ఫలితాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నా, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సరిచేసుకునే అవకాశం వెబ్‌సైట్‌లో రెండు రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://apdsc.apcfss.in/

స్కోరు కార్డ్ డౌన్‌లోడ్ విధానం
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

మీ హాల్ టికెట్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

“సర్వీసెస్” విభాగంలో AP DSC Results‌ను సెలెక్ట్ చేయండి.

స్కోరు కార్డు, మొత్తం అభ్యర్థుల జాబితా, పేపర్లు, మార్కులు, క్వాలిఫికేషన్ స్టేటస్ వంటి వివరాలు కనిపిస్తాయి.

మెగా డీఎస్సీ వివరాలు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

మొత్తం 3.35 లక్షల మంది ఏపీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇతర రాష్ట్రాల నుంచి 7,159 దరఖాస్తులు వచ్చాయి.

కలిపి 5,77,417 అప్లికేషన్లు స్వీకరించబడ్డాయి.

జిల్లాల వారీగా చూస్తే, ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి అత్యధికంగా 39,997 దరఖాస్తులు వచ్చాయి.

కడప జిల్లా నుండి అత్యల్పంగా 15,812 దరఖాస్తులు అందాయి.

Leave a Reply