ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 30న డీఎస్సీ టీచర్ రిక్రూట్‌మెంట్ 2025 హాల్‌టికెట్లను విడుదల చేయనుంది. ఈ హాల్ టికెట్లను అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డీఎస్సీ పరీక్ష తేదీలు & అభ్యర్థుల గణాంకాలు
రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం 5.67 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3.53 లక్షల మందికి పైగా ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేశారు.
హాల్ టికెట్‌లో ఉండే కీలక సమాచారం
అభ్యర్థుల హాల్ టికెట్‌లో ఈ సమాచారం ఉంటుంది:
అభ్యర్థి పేరు
ఫోటో & సంతకం
పరీక్ష తేదీ, సమయం
పరీక్ష కేంద్రం వివరాలు
ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే, వెంటనే హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలి. అలాగే, హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు కూడా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి?
AP DSC హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి:
అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ఓపెన్ చేయండి
హోమ్‌పేజీలో ఉన్న “Download Hall Ticket” లింక్‌పై క్లిక్ చేయండి
మీ యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
CAPTCHA టైప్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
అభ్యర్థులకు సూచన
చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా హాల్ టికెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.