నీట్‌లో ఫెయిల్.. కానీ రూ.72 లక్షల ప్యాకేజ్ సాధించిన బెంగళూరు యువతి!

నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాక జీవితం ముగిసిపోయిందని చాలా మంది నిరాశకు గురవుతారు. అయితే బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని రీతుపర్ణ కె.ఎస్ అలాంటి వారికీ ప్రేరణగా నిలిచింది. నీట్‌లో అర్హత సాధించలేకపోయినా, ఆమె దానిని నిరాశగా తీసుకోకుండా ఇంజినీరింగ్‌పై దృష్టి పెట్టింది.

మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న సమయంలోనే రీతుపర్ణ, లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్ రాయిస్‌లో ఎనిమిది నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. అదే కంపెనీలో ఆమెకు రూ.39.6 లక్షల జీతంతో ఉద్యోగం లభించగా, ఏప్రిల్‌లో అది రూ.72.3 లక్షల వార్షిక ప్యాకేజీగా పెరిగింది.

ప్రస్తుతం రీతుపర్ణ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచింది. మొదట్లో డాక్టర్ కావాలని అనుకున్న రీతుపర్ణ, నీట్‌లో ప్రభుత్వ సీటు రాకపోవడంతో 2022లో CET ద్వారా ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ తీసుకుని రోబోటిక్స్, ఆటోమేషన్‌లో BE చదువుతోంది.

Leave a Reply