TTD: తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త.. అన్నప్రసాదంలో ఇకపై అవి కూడా!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులకు టీటీడీ మరో మంచి వార్తను అందించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజన సమయంలో భక్తులకు వడ్డించే ఐటెంలలో ఇకపై మరో ప్రత్యేక ఐటెం చేర్చనున్నారు. ఇప్పటి వరకు కేవలం పగటి భోజన సమయంలో మాత్రమే వడ్డించే వడలను.. ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుతం రోజుకు సుమారు 70,000 నుండి 75,000 వరకు వడలు తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారు. కొత్త నిర్ణయం ప్రకారం ఈ సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అన్నప్రసాద కేంద్రంలో వడలు అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, బోర్డు సభ్యులు శాంతారామ్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితర అధికారులు ప్రారంభించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని భక్తులు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply